వాహనదారులు సంతోషపడే వార్త. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 1.42 పైసలు, అలాగే డీజిల్‌పై రూ. 2.01 పైసలు తగ్గించినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలను అనుసరించి ఇండియాలోని ఆయిల్ కంపెనీలు ప్రతీ 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలపై సమీక్ష జరుపుతూ ధరలను తగ్గించండం లేదా పెంచడం చేస్తుంటాయి. కాగా, ధరలు తగ్గడం ఈ మధ్య కాలంలో ఇది రెండోసారి కావడం విశేషం.
Mobile AppDownload and get updated news