ఈ బీర్‌ను తయారు చేస్తుంది బెల్జియంలోని 'ఘెంట్ యూనివర్శిటీ'కి చెందిన పరిశోధకులు. యూరిన్ తో బీర్ తయారు చేసే యంత్రాన్ని రూపొందించినట్లు వారు చెప్తున్నారు. వారి చెప్తున్న ప్రకారం భారీ మొత్తంలో యూరిన్ ను సేకరించి ఓ పెద్ద బాయిలర్ లోకి పంపించి సోలార్ పవర్ ద్వారా యూరిన్ లోని పొటాషియం, పాస్పరస్, నైట్రోజన్ లాంటి ఖనిజ లవణాలను వేరు చేస్తారు. ఈ ఖనిజ లవణాలను ఎరువులుగా కూడా వాడుకోవచ్చంట. ఈ ప్రక్రియలో వేరు చేయబడిన నీటిని బీర్ తయారీకి ఉపయోగిస్తారట. ఈ రకంగా తయారు చేయబడిన బీర్ ఎంతో రుచిగా ఉంటుందట. అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిది అని కూడా చెప్తున్నారు. ఈ బీర్ త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఈ బీర్ తయారీకి ఉపయోగించే యూరిన్ మనుషులదా? జంతువులదా? అనేది మాత్రం వెల్లడించలేదు.
ఇదంతా చదివిన తర్వాత మీకు 'శ్రీరామచంద్రులు' అనే తెలుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రఘుబాబుల మధ్య జరిగే కామెడీ సీన్ గుర్తొచ్చిందనుకుంటా? ఆ సీన్ లో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కలిసి ఓ బార్ లో మందుకొడుతా ఉంటారు. అదే సమయంలో వీళ్లకు అప్పు ఇచ్చిన రఘుబాబు వీళ్లను పట్టుకునేందుకు వస్తాడు. రఘుబాబును చూసిన రాజేంద్ర, బ్రహ్మీలు టేబుల్ కింద దాక్కోంటరు. అదే టేబుల్ వద్ద వచ్చి కూర్చోని రఘుబాబు వీళ్లు వచ్చే లోపు ఓ బీర్ ఆర్డర్ చేస్తాడు అదే సమయంలో మన బ్రహ్మీకి సుస్సూ వస్తుంది. లేస్తే దొరికిపోతాడేమో అనే భయంతో టేబుల్ మీద ఉన్న రఘుబాబు తాగే బీర్ బాటిల్ తీసుకొని అందులోనే పని కానిచ్చేస్తాడు బ్రహ్మీ. అది తెలీకుండా రఘుబాబు ఆ బీర్ తాగుతూ.. ' అబ్బా ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్టీగా ఉందీ.. ఆహా.. అమృతం. బేరర్.. సేమ్ బీర్.. వన్ మోర్.' అంటూ ఆర్డర్ ఇస్తాడు. ఈ సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. చివరగా ఒక మంచి మాట.. 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం'.
Mobile AppDownload and get updated news