Mobile AppDownload and get updated news
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ బజ్వా 'తిక్క' మూవీ ఆడియో ఫంక్షన్లో తళుక్కుమంది. ఇంతకీ ఆమెకూ, తిక్క సినిమాకు సంబంధమేంటా అని ఆరా తీస్తే.. ఆ సినిమా దర్శకుడు సునీల్, పూనమ్ ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసింది. అందుకే తిక్క ఆడియో ఫంక్షన్‌కు ఆమెను ఆహ్వానించాడట. ఈ విధంగా తమ ప్రేమ గురించి అందరికీ తెలిసేలా చేశాడన్నమాట. అవకాశాలు లేకపోవడంతో ఆమె కెరీర్ నిరాశాజనకంగా ఉంది. కాబట్టి సునీల్‌ను పెళ్లి చేసుకొని సెటిలైపోతుందేమో. 'మొదటి సినిమా' ద్వారా తెలుగులోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వాకు బాస్ రూపంలో నాగార్జున లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం లభించింది. కానీ ఈ అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది. తెలుగునాట అవకాశాలు రాకపోడంతో తమిళ, మలయాళీ సినిమాల వైపు ఆమె అడుగులేసింది. కానీ పాపం పూనమ్‌కు అక్కడ కూడా అవకాశాలు లభించలేదు. దీంతో హీరోయిన్‌గా ఆమె కెరీర్ ముగిసింది. సునీల్ రెడ్డిని పూనం బజ్వా పెళ్లాడిందని గత ఏప్రిల్ చివర్లో రూమర్లు వచ్చాయి. కాగా వాటిని ఆమె ఖండించారు.