ప్రత్యేక హోదా అంశంపై మోడీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్న నేపథ్యంలో పోరుబాట పట్టాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు వారు పార్లమెంట్ భవనం గాంధీ విగ్రహం వద్ద సోమవారం ధర్నాకు దిగారు. విభజన హామీలతో సహా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా ఈ ధర్నాలో టీపీపీ లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో దుమారం చెలరేగుతన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ విఖరిపై ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్,వైసీపీలు దుమ్మెతిపోస్తున్నాయి. ఏపీ ప్రజల ముందు దోషిగా ఉండకూడదనే ఉద్దేశంతో టీడీపీ కూడా సభలో తమ స్వరాన్ని పెంచిన విషయంగా తెలిసిందే. తాజాగా మరో అడుగుముందుకేసి మిత్రపక్షమైన మోడీ సర్కార్ వైఖరికి నిరసగా పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టడం విశేషం.
Mobile AppDownload and get updated news