Mobile AppDownload and get updated news
గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆనందిబెన్ పటేల్ అకస్మాత్తుగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతగా హఠాత్తుగా ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా తెలియదు. అది కూడా ఆమె ఫేస్ బుక్ తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. అప్పట్నించి గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమై బీజేపీ తర్జనభర్జన పడుతోంది. బుధవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ సమావేశాంలో ఆనందిబెన్ రాజీనామాను పార్టీ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే కొత్త ముఖ్యమంత్రిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు పేర్లు సీఎం రేసులో ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్ హెల్త్ మినిస్టర్ గా పనిచేస్తున్న నితిన్ పటేల్, కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా, ఆ రాష్ట్ర స్పీకర్ గణపత్ వసావా, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, మరో రాష్ట్ర మంత్రి సౌరభ్ పటేల్ లో ఒకరిని కొత్త ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. వీరిలో కూడా అధికంగా అంటే... హెల్త్ మినిస్టర్ నితిన్ పటేల్ కు అవకాశం ఎక్కువ ఉంది. మోడీ ప్రధానమంత్రి అయ్యాక... అప్పుడు కూడా సీఎం పదవి రేసులో ఈయన ముందున్నారు. కాకపోతే పటేల్ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఆనందిబెన్ ను ముఖ్యమంత్రిని చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఈ రోజు తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.