Mobile AppDownload and get updated news
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితి మరింతగా మెరుగైనట్టు తెలుస్తోంది. నాలుగురోజులపాటూ ఐసీయూలోనే చికిత్స పొందిన ఆమెను శుక్రవారం ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. భుజానికి శస్త్రచికిత్స కూడా పూర్తయింది. ఆవిడ పరిస్థితి చాలా మెరుగైనట్టు గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం వారణాసిలో జరిగిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దానివల్ల భుజానికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. డీహైడ్రైషన్ సమస్యతో కూడా ఆమె బాధపడ్డారు. ఆమెను చూసేందుకు కాంగ్రెస్ సీనియర్ ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఆసుపత్రి బయట కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా గుమిగూడి ఉంటున్నారు.