బోపన్న, పేస్ జోడి విషయానికి వస్తే.. ఇద్దరి మధ్య సహృద్భావ వాతావరణం కొరవడింది. పేస్‌తో కలిసి ఆడేది లేదని బోపన్న గతంలో తేల్చి చెప్పగా, తాజాగా అతడితో కలిసి రూంలో ఉండేందుకు కూడా ఇష్టపడని పేస్.. కోచ్ జీషన్ అలీతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరిదీ విభిన్న శైలి కావడంతోపాటు వారు కలిసి ప్రాక్టీస్ చేసింది కూడా లేదు. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో సమన్వయంతో ఎలా ఆడతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితుల్లో వీరిద్దరూ విబేధాలు పక్కనబెడితేనే రియోలో భారత టెన్నిస్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయి. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-ప్రార్థన తాంబ్రే జోడి చైనాకు చెందిన పెంగ్ షువాయ్ -షువాయ్ జంగ్ ద్వయంతో శనివారమే తొలి మ్యాచ్ ఆడనుంది.
Mobile AppDownload and get updated news