వారి గురి తప్పలేదు. అందుకే అప్పుడే గోల్డ్ మెడల్ కొట్టేశారు. రియో ఒలింపిక్స్ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అమెరికా దక్కించుకుంది. పది మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన జిన్నీ థ్రాషర్ (19) ఈ విజయం సాధించారు. శనివారం జరిగిన ఈ పోటీల్లో థ్రాషర్ తన ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరచింది. ఫైనల్ రౌండ్‌లో 208.0 పాయింట్లు సాధించిన థ్రాషర్.. చైనా షూటర్ డు లీని ఓడించింది. దీంతో రియో ఒలింపిక్స్ లో అందజేసిన తొలి పతకాల్లో స్వర్ణం అమెరికాకు దక్కింది.
Mobile AppDownload and get updated news