Mobile AppDownload and get updated news
రియో ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్స్ అపూర్వి చండేలా, అయోనికా పాల్ నిరాశపరిచారు. 10మీ ఎయిర్ రైఫిల్‌లో పోటీపడిన ఈ ఇద్దరూ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగారు. అపూర్వి చెండేలా 411.6 పాయింట్లతో 34వ స్థానం, అయోనికా పాల్ 403 పాయింట్లతో 47 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్ కు అర్హత సాధిస్తారు కాబట్టి వీరు వెనుతిరగాల్సి వచ్చింది. అలాగే రియో ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో భారత్‌కు చెందిన మనిక బాత్రా, మౌమ దాస్ ఓటమి పాలయ్యారు. తొలి రౌండ్‌లో మనిక బాత్రా పోలాండ్ కు చెందిన ఫ్రాంక్ కాటార్జినాపై 4-2 తేడాతో ఓడిపోయింది. మరో సింగిల్స్ లో మౌమ దాస్ రొమానియాకు చెందిన మోంటాయిరో డొడీన్ దానీలా చేతిలో 4-0 వరుస సెట్లలో ఓటమి పాలైంది. మొత్తానికి క్రీడాకారిణులు రియో ఒలింపిక్స్ లో తమ సత్తా చాటలేకపోతున్నారు.