రియో ఒలింపిక్స్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు జపాన్ పై తన శాయశక్తుల పోరాడింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్ బరిలోకి దిగిన మన టీమ్ తన సత్తా చాటేందుక అహర్నిశలు ప్రయత్నించింది. భారత్ పూల్-బిలో భాగంగా జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించింది. మొదట్లో జపాన్ టీమ్ 2 గోల్స్ చేయగా మన టీమ్ మాత్రం ఒక్కటి కూడా చేయలేకపోయింది. ఆ తర్వాత భారత్ టీమ్ చెలరేగింది. పెనాల్టీ కార్నర్ అవకాశాలను అందిపుచ్చుకొని రెండు గోల్స్ చేసింది. భారత్ గోల్ పోస్ట్ పై జపాన్ బృందం మూకుమ్మడి దాడులను గోల్ కీపర్ సవిత సమర్థంగా అడ్డుకుంది. జపాన్ క్రీడాకారులు ఎమి నిషికోరి 15వ నిమిషంలో ఒక గోల్ చేయగా, మీ నకషిమా 28వ నిమిషంలో మరో గోల్ చేశారు. అయితే భారత్ టీమ్ చెందిన ఫార్వర్డ్ రాణి రాంపాల్ 31వ నిమిషంలో ఒక గోల్ చేసింది. మరో ప్లేయర్ మిడ్‌ఫీల్డర్ లిలిమ మింజ్ 40వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లను గోల్స్ గా మలచడంతో మూడో క్వార్టర్ ముగిసేసరికి రెండు జట్ల స్కోరు 2-2తో సమానమైంది. ఆఖరి క్వార్టర్ లో రెండు జట్ల ప్లేయర్స్ గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ రెండు జట్ల గోల్ కీపర్లు సమర్థంగా అడ్డుకోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తానికి చాలా కాలం తర్వాత ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు తన పోరాట పటిమను ప్రదర్శించింది.
Mobile AppDownload and get updated news