Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 86060

జీఎస్టీ సవరణల బిల్లుకి లోక్ సభ ఆమోదం

$
0
0

జీఎస్టీ సవరణల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లుకి తొలుత రాజ్యసభ చేసిన సవరణలపై సోమవారం రాత్రి 7 గంటల తర్వాత లోక్ సభలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో ఏఐఏడీఎంకే సభ్యులు మినహా లోక్ సభ సభ్యులు అంతా ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లుకి రాజ్యసభ చేసిన సవరణలని ఆమోదించారు. ఈ ఓటింగ్‌తో సవరణలతో కూడిన వస్తు, సేవల పన్నుల బిల్లుకి పార్లమెంట్ ఉభయ సభల అంగీకారం లభించినట్టయింది. రాజ్యసభలో బిల్లుకి సవరణలపై ఓటింగ్ సందర్భంలో బిల్లుకి వ్యతిరేకంగా వాకౌట్ చేసిన ఏఐఏడీఎంకే సభ్యులు తాజాగా లోక్ సభలో జరిగిన చర్చలోనూ పాల్గొనకుండా సభ నుంచి బయటికెళ్లిపోయారు.

జీఎస్టీ సవరణ బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తంచేశారు. ఓటింగ్ కన్నా ముందు జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని బిల్లుపై తన అభిప్రాయాన్ని వినిపించారు.


బిల్లు పాస్ అయిన అనంతరం పార్లమెంట్ హాలు బయట మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ.. ఈ బిల్లు పాస్ అవడాన్ని దేశ భవిష్యత్‌కి ఓ ముందడుగుగా భావించొచ్చని అన్నారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 86060

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>