రియోలింపిక్స్ లో మహిళల 25మీ. పిస్టల్ ర్యాపిడ్, ప్రిసిషన్ విభాగాల్లో భారత షూటర్ హీనా సిద్ధు అర్హత సాధించలేకపోయింది. పిస్టల్ ప్రిసిషన్ విభాగంలో జరిగిన క్వాలిఫికేషన్ పోటీల్లో మూడు సిరీస్ ల్లో వరుసగా 95, 95, 96 ప్రకారం మొత్తం 286 స్కోర్ చేసింది. దీంతో 15వ స్థానంలోకి వెళ్లింది. అలాగే ర్యాపిడ్ విభాగంలో జరిగిన అర్హత పోటీల్లో మూడు సిరీస్‌ల్లో 97, 97, 96తో మొత్తం 290 స్కోర్ సాధించింది. దీంతో 20 స్థానంలోకి వెళ్లింది. ఫలితంగా క్వాలిఫై కాలేకపోయింది. ఇండియా టాప్ షూటర్ గా ఉన్న హీనా సిద్ధు రియో ఒలిపింక్స్ లో రీసెంట్ గా జరిగిన 10మీ. ఎయిర్ పిస్టల్ పోటీల్లో నూ ఫైనల్ కు చేరుకోలేకపోయింది. అయితే ఆ రోజు 'ఇప్పుడు అయ్యిందేదో అయింది ఈ నెల 9వ తేదీన జరిగే ఈవెంట్లలో తన ప్రతిభ చాటుతా' అన్నట్లు ట్విటర్ లో పోస్టు చేసింది. కానీ ప్రస్తుతం కూడా విజయం సాధించలేకపోయింది. రియో ఒలింపిక్స్ అర్హత పోటీల్లో అందరినీ మెప్పించిన ఈమె ఇప్పుడెందుకో ఇలా పేలవ ప్రదర్శన ఇచ్చింది.
Mobile AppDownload and get updated news