రియో ఒలింపిక్స్‌లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ మరో బంగారు పతకాన్ని సాధించాడు. ఈతలో తనని మించిన వారు లేరని మళ్లీ నిరూపించుకున్నాడు. 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సంపాదించాడు. గతంలో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ తనని ఓడించిన జపాన్ ఈతగాడు మసాటో సాకాయ్ ని ఈసారి ఫెల్ఫ్స్ ఓడించాడు. ఇక క్వాలిఫయింగ్ రౌండ్ లో మొదటి స్థానంలో నిలిచిన హంగేరీ ఈతగాడు థామస్ ను కూడా ఫెల్ఫ్స్ సులువుగా దాటేవాడు. మసాటో రజత పతకాన్ని, థామస్ కాంస్య పతకాన్ని సాధించారు. తాజాగా గెలిచిన బంగారు పతకంతో కలిపి ఫెల్ఫ్స్ ఒలింపిక్స్ ఖాతాలో మొత్తం 20 బంగారు పతకాలు పడ్డాయి. రెండు రజత, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. అందుకు ఫెల్ఫ్స్ ని బంగారు చేప అని పిలుస్తారు.
Mobile AppDownload and get updated news