Mobile AppDownload and get updated news
రియో ఒలింపిక్స్ మహిళల 800 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో అమెరికా స్విమ్మర్ కెటీ లెడెకీ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 8.04.79 సెకన్లలో 800 మీటర్ల దూరాన్ని ఈదిన ఆమె గత రికార్డులను బద్దలు కొట్టింది. రికార్డు విజయంతో ఆమె ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. బ్రిటన్‌కు చెందిన జార్జ్ కార్లిన్ రజత పతకాన్ని, హంగేరియన్ స్మిమ్మర్ కాపస్ బొగ్లార్క కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విజయంతో ప్రస్తుత ఒలింపిక్ క్రీడల్లో ఆమె ఖాతాలో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం చేరాయి. దీంతో ఒకే ఒలింపిక్‌లో నాలుగు స్వర్ణాలు గెలుపొందిన మూడో అమెరికన్ అథ్లెట్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. ఈ ఒలింపిక్ క్రీడల్లో ఫ్రీ స్టయిల్ విభాగంలో మూడు బంగారు పతకాలను సాధించిన ఆమె ఆ ఘనత సాధించిన రెండో అమెరికన్ స్విమ్మర్‌గా రికార్డులకెక్కింది. 2012లో 15 ఏళ్ల వయసులోనే లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నలెడెకీ ఆ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.