రియో ఒలింపిక్స్ లో 100మీటర్ల పరుగు (హీట్-5) పోటీలో స్ప్రింటర్ ద్యుతీచంద్ ఓడిపోయారు. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ ఈవెంట్‌లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించడం విశేషమైతే ఓడిపోవడం బాధాకరం. 100 మీటర్ల ఫస్ట్ రౌండ్ లో ద్యుతీ ఓవరాల్ గా 50వ స్థానంతో సరిపెట్టింది. ఇక ఎనిమిది మంది పాల్గొన్న ఐదో హీట్ లో ఈమె 11.69 సెకన్ల టైమింగ్ తో రేస్ పూర్తి చేసి ఏడో స్థానంలోకి వెళ్లింది. దీంతో క్వాలిఫై కాలేకపోయింది. కాగా తన ఓటమిపై ద్యుతీచంద్ స్పందించింది. తాను అందరినీ నిరాశ పరిచినట్లు తెలుసని అయినా తనపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి థ్యాంక్స్ అని పేర్కొంది. తాను 36 గంటల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 5న సాయంత్రం రియోకు చేరుకున్నాక వెన్నునొప్పితో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నట్లు పేర్కొంది. సాధన చేసేందుకు ఇక్కడ తనకెవరూ సహకరించలేదన్నారు. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్ లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.
Mobile AppDownload and get updated news