రియో ఒలింపిక్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో వాల్ట్ విభాగం ఫైనల్స్ నేడు జరగనున్నాయి. ఇందులో భారత్ తరఫున దీప కర్మాకర్ పార్టిసిపేట్ చేయనున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో తొలి ఒలింపిక్ ఆడుతున్న దీప ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్వాలిఫికేషన్ లో సత్తా చాటి ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే దీప నేడు జరిగే ఫైనల్స్ లో అత్యంత ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసం చేయనుంది. ఈ విన్యాసం చేస్తే ఎక్కువ స్కోరింగ్ పొందొచ్చు. వాల్ట్ విభాగంలో ప్రొడునోవాకు అత్యధికంగా 7 పాయింట్లుంటాయి. మిగతా విన్యాసాలకు 5.000, 6.000, 6.200, ఇలా తక్కువే దక్కుతాయి. ఇప్పుడు దీప ప్రపంచ మేటి జిమ్నాస్ట్ లతో ఒలింపిక్స్ పతకం కోసం పోటీ పడుతుందంటే అందుకు కారణం ప్రొడునోవానే. ఆమె చిన్నప్పుడు ఇష్టంలేకున్నా తండ్రి ప్రోత్సాహంతో జిమ్నాస్టిక్స్ ను కెరీర్ గా ఎంచుకుంది. తర్వాత దీప ఆపై ఆటపై మక్కువ పెంచుకుంది. సాహసాలతో ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ప్రత్యేక స్థానం కల్పించింది. కాగా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో వాల్ట్ విభాగం ఫైనల్ లో మొత్తం ఎనిమిది మంది పోటీపడనున్నారు. ఇందులో అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్ లాగా ఎవరూ పర్ఫామెన్స్ చేయలేరనేది వాస్తవం. ఒలింపిక్స్ లో కచ్చితంగా దీప సత్తా చాటాలని ఆశిద్దాం. ఒక వేళ పతకం సాధించినా.. సాధించకపోయినా యువతకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Mobile AppDownload and get updated news