Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85919

మోడీ, తొగాడియాల వైరం ఇప్పటిది కాదు 

$
0
0

ప్రధాని నరేంద్రమోది.. వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. గోరక్షకుల పేరుతో దాడుల చేస్తున్నారని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తొగాడియా స్పందించారు. ప్రధాని మోది హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారని తొగాడియా అన్నారు. దీంతో సిద్ధాంతపరంగా బీజేపీకి, నరేంద్ర మోది ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండే వీహెచ్‌పీకి మధ్య వైరం మొదలయ్యిందా అనే అనుమానాలు ప్రారంభమైనా మోది, తొగాడియాల వైరం ఈనాటిది కాదు, గత ఇరవై ఏళ్లుగా వీరిద్దరి మధ్య రాజకీయపరమైన అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రవీణ్ తొగాడియా, నరేంద్ర మోదీలు ఒకప్పుడు మంచి మిత్రులు. ఇద్దరూ ఒకేసారి ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన వారే. 1980లలో ఆహ్మాద్‌బాద్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం హేగ్డేవార్ భవన్‌లో ఇద్దరూ చాలాకాలం పాటు సహవాసం చేశారు. ఆహ్మాదాబాద్ వీధుల్లో ఇద్దరు ఒకే స్కూటర్‌పై వెళ్తుండటాన్ని ఇప్పటికీ సంఘ్ పరిహర్ నేతలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తికి ఎటెళ్లినా ఇద్దరు కలిసేవెళ్లేవారు. తొగాడియా స్కూటర్ నడిపిస్తుండగా మోదీ వెనకాల కూర్చునేవాడు. అప్పటికే వైద్యుడిగా పనిచేసే తొగాడియ 1983లో విహెచ్‌పీలో చేరగా, పూర్తిస్థాయి ప్రచారక్‌గా కొనసాగిన మోది 1984లో బీజేపీలో చేరాడు. ఇద్దరు బీజేపీ బలోపేతానికే కృషి చేసేవారు. సలహాలు ఇచ్చిపుచ్చుకునేవారు. 1995లో బీజేపీ గుజరాత్‌లో అధికారంలో వచ్చి కేశుభాయ్ పటేల్ సీఎంగా పనిచేశారు. ఆ సమయంలో పటేల్ ప్రభుత్వంలో మోది, తొగాడియాలు కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో ఈ ఇద్దరితో పటేల్ సంప్రదింపులు చేసేవారు. కేశుభాయ్ పటేల్‌పై శంకర్ సింగ్ వాఘేలా తిరుగుబాటు చేసిన సమయంలోనూ ఇద్దరు పటేల్ వైపే ఉన్నారు. వాఘేలా ప్రభుత్వం తొగాడియాను జైళ్లో పెట్టినప్పుడు అతని విడుదల కోసం మోది వీధుల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేయించాడు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యారు..అప్పటి కేంద్రహోంమంత్రి ఎల్.కే అద్వానీ... తొగాడియాకు ప్రాధాన్యం తగ్గించారు. అయినా తొగాడియా తన అచరుడు జోదాపియాను గుజరాత్ హోంమంత్రిగా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. 2002 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయ్యాలని తొగాడియా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మోది గెలిచి సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టినా తొగాడియా అనుచరుడు జోదాపియాను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో తొగాడియా అవసరం ఎంతమాత్రం మోదికి లేదనే సంకేతాలిచ్చారు. మోది తనను అవకాశం కోసం వాడుకున్నాడని తొగాడియా భావించి దూరమయ్యాడు. దీనికితోడు గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా భజరంగ్, వీహెచ్‌పీ కార్యకర్తలను మోది సర్కారు అరెస్టు చేయడంతో పుండుమీద కారం చల్లినట్లైంది. అద్వానీ పాక్ నేత జిన్నాను పొగిడినప్పుడు వీహెచ్‌పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పోలీసులు లాఠీచార్జీలు కూడా చేశారు. రోడ్డు వెడల్పు, ప్రజా అవసరాల దృష్ట్యా గాంధీనగర్‌లో ఉన్న దాదాపు 200 గుళ్లను కూడా మోది ప్రభుత్వం కూల్చేసింది. దీనికి నిరసనగా తొగాడియా మోదిని 'మౌలానా మోది' అని విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్ అభివృద్ధి మోడల్ దేశమంతా విస్తరించేందుకు మోదిని ప్రధానిగా ఎన్నుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైనప్పుడు కూడా వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ సంస్థల నేతలు నేతలు అశోక్ సింఘాల్ వంటివారు మద్ధతుగా నిలిస్తే..తొగాడియా మాత్రం వ్యతిరేకించారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85919

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>