భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. త్రివిధ దళాలు తమ గౌరవ వందనాన్ని మోడీకి సమర్పించాయి. స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా జనం ఎర్రకోటకు తరలివచ్చారు. వందల సంఖ్యలు స్కూలు పిల్లలు పాల్గొన్నారు. వీఐపీలు, వీవీఐపీలు ఎంతో మంది ఎర్రకోటలో వేడుకలకు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. జెండా ఎగురవేయడానికి ముందు రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి మోడీ నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోటకు వచ్చారు. ఎర్రకోటలో భారీ భద్రతా ఏర్పాట్టు చేశారు అధికారులు. దాదాపు 7000 మంది పోలీసులు కాపలా కాస్తున్నారు.
Mobile AppDownload and get updated news