Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85919

కొత్త జిల్లాల్లోనే దసరా పండగ: సీఎం కేసీర్ 

$
0
0

తెలంగాణ రాష్ట్రంలో 70వ స్వాతంత్ర్య దినోవ్సత వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. దసరా పండగ రోజే కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయని ఆయన వెల్లడించారు. గోల్కొండ కోటలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే ..'ప్రాజెక్టుల స్థాపనలో భాగంగా ఈనెల 23వ తేదిన మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. పాలమూరు జిల్లా రైతాంగ ఇబ్బందులు తీర్చేందుకు ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా రావాల్సిన వాటా కోసం కృషిచేస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. విద్యుత్, రైల్వే ప్రాజెక్టుల కోసం ప్రధాని మోదిని కలిశాం. ఈమధ్యే తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాని చేతుల మీదుగా మిషన్ భరీరథ పథకాన్ని ప్రారంభించాం. జాతీయ రహదారుల విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. ఈవిషయంలో కేంద్రాన్ని ఒప్పించి 1951 కిలోమీటర్ల జాతీయ రహదారులు సాధించాం. ఇప్పుడు తెలంగాణలో 4590 కిలోమీటర్ల జాతీయ రహదారులున్నాయి. రాజీలేని విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకుంటున్నాం. పేదల ప్రజల సంక్షేమం కోసం రూ,30వేల కోట్ల నిధులతో పలు పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం. ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థుల కోసం కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలు, కళశాలలు స్థాపిస్తున్నాం. కేజీ టు పీజీ విద్యను ఖచ్చితంగా అందిస్తాం. హాస్టళ్లల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పేద విద్యార్థులకు సన్నబియ్యంతో మద్యాహ్నా భోజనం పెడుతున్నాం. ఎస్టీలు, మైనార్టీల స్థితిగతులు అధ్యయనం చేయించి..వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తున్నాం. సామాజిక న్యాయం అమలు కోసం మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేశాం. పేద బ్రాహ్మణులకు రూ.వంద కోట్ల నిధులు కేటాయించాం. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా లుంబినీపార్కులో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తున్నాం. దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు పనిచేస్తాయి. సమైక్య రాష్ట్రంలో కూనరిల్లిన ప్రాజెక్టులను పునరుజ్జీవించజేస్తాం. సన్న, చిన్నకారు రైతాంగానికి నూరుశాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నాం. కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి సబ్సిడీ ఇస్తాం. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నాం. వ్యవసాయ అధికారుల నియామాక భర్తీ చేపడుతున్నాం. 21లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మాణం చేపట్టాం. 2018 మార్చి నాటికి ప్రతిఇంటికి తాగు నీరు అందిస్తాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మిగులు విద్యుత్ రాష్ట్రం త్వరలో నిలువనున్నాం. మందుల కొనుగోలుకు ప్రభుత్వ ఆసుపత్రులకు మరిన్ని నిధులు పెంచుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయేవారి శవాలను తమ ఇంటికి పంపించేందుకు ఉచిత ఆంబులెన్సులు ఏర్పాటు చేయబోతున్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా 2300 పరిశ్రమలకు అనుమతులిచ్చాం. దీనివల్ల రూ. 46వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కొత్త కంపెనీల స్థాపన కోసం టీహబ్ ను ప్రారంభించాం. తెలంగాణను ఐటీ హబ్ గా ప్రపంచమంతా భావిస్తోంది. ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 37వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. కరువు, కాటకాలను నివవారించేందుకు, పచ్చని నీడను ఇచ్చేందుకు ఈయేడాది 46 కోట్ల మొక్కలు నాటాలని హరితహరం పేరుతో పథకం నిర్దేశించుకున్నాం. ఐదేళ్లలో తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం. ప్రపంచంలో అతిపెద్ద కార్యక్రమంలో మనది మూడోది. హరితమిత్ర పేరుతో నేటి నుంచే హరితహారంలో ముందున్న వారికి అవార్డులు అందిస్తున్నాం. మొక్కలను చంటిబిడ్డల్లా సంరక్షించాలి. శాంతిభద్రల పరిరక్షణల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అరాచక శక్తుల ఆటకట్టిస్తున్నాం. పోలీసుల పనితీరుకు వారు జాతీయస్థాయిలో అవార్డులు పొందడమే ఇందుకు నిదర్శనం. 38జాతీయ అవార్డులు సాధించడం గొప్పవిషయం. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు త్రికరణశుద్ధిగా పనిచేస్తున్నాం.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85919

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>