Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85987

అసోంలో వరుస బాంబు పేలుళ్లు

$
0
0

దేశమంతా స్వాతంత్య్ర దేశ వేడుకల్లో తలమునకలై ఉండగా... అసోంలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉల్ఫా - ఇండిపెండెంట్ మిలిటెంట్లు రాష్ట్రంలోని నాలుగు చోట్ల బాంబు దాడులు చేశారు. ఉదయం ఏడు గంటల 15 నిమిషాల నుంచి మొదటి బాంబు పేలింది. ఆ బాంబు ఓ స్కూల్ సమీపంలో పేలడంతో అంతా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం దుందుమా అనే ప్రాంతంలో ఓ టీ ఎస్టేట్ వద్ద బాంబు పేలింది. తరవాత మసువా అనే ప్రాంతంలో బాంబు పేలుళ్లు వినిపించాయి. బాంబు శబ్ధాలకు స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఇళ్లల్లోంచి బయటికి రావడానికే భయపడ్డారు. అయితే ఈ పేలుళ్లలో ఎక్కడా... ఒక్కరు కూడా గాయపడినట్టు సమాచారం అందలేదు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85987

Trending Articles