Mobile AppDownload and get updated news
30 వారాలు నిండిన గర్భాన్ని తొలగించడం కుదరదని బరేలీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. ఈ సమయంలోల గర్భ విచ్ఛిత్తికి ప్రయత్నిస్తే తల్లిబిడ్డలకు ప్రమాదకరమని కోర్టు స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన ఓ 16 ఏళ్ల బాలిక తన గర్భవిచ్ఛిత్తికి అనుమతివ్వాలంటూ కోర్టుకు విన్నవించుకున్నప్పుడు న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. తన కూతురు గర్భానికి ఆమె యాజమానే కారణమని తండ్రి చెబుతున్నారు. పనిలో కుదర్చుకున్న యాజమాని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తన కుమార్తెను గర్భవతిని చేశాడని ఆయన అన్నారు. తన కూతురు గర్భవతి అని మూడుల నెలల దాకా కుటుంబంలో ఎవ్వరికీ తెలియదని ఆయన కోర్టుకు చెప్పారు. బాలిక 19 వారాల 6 రోజుల గర్భంతో ఉన్నప్పుడు గర్భస్రావం కోసం కోర్టును ఆశ్రయించింది. 20వారాల రోజుల గర్భాన్ని కోర్టు అనుమతి వేరకు తొలగించుకునే అవకాశం చట్టం కల్పిస్తుంది. దీనికితోడు అసాధారణ పరిస్థితుల్లోనూ తగు కారణాలతో 20వారాలకు మించిన గర్భవిచ్ఛిత్తికి కూడా సుప్రీంకోర్టు అనుమతిస్తుంది.