రియో ఒలింపిక్స్ భారత్ బోణీ కొట్టింది. ఎట్టకేలకు ఒక పతకాన్ని సాధించింది. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రధాని మంత్రి మోడీ భారత్ కు పతకాన్ని తెచ్చిపెట్టిన సాక్షి పై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాఖీ పండుగ రోజున భారత ఆడబిడ్డ దేశానికి పతకం సాధించడం చాలా గర్వకారణమని అన్నారు. సాక్షి చరిత్ర సృష్టించిందని, దేశంలోని క్రీడాకారులకు చాలా స్పూర్తిని కలిగించిందని మెచ్చుకున్నారు. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను ప్రజలకు తెలిపారు.
Mobile AppDownload and get updated news