దేశమంతా రాఖీ పండుగ చేసుకుంటున్న రోజు సాక్షి తన అన్నకు పెద్ద కానుకను ఇచ్చింది. రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని గెలిచి ఆమె ఇంట్లోకే కాదు, దేశానికే సంబరాలు తెచ్చింది. ఇక ఆమె అన్న సచిన్ రాధాకృష్ణన్ సంతోషమైతే చెప్పక్కర్లేదు. రాఖీ పండుగ రోజు తన చెల్లి చాలా పెద్ద కానుక ఇచ్చిందంటూ తెగ ఆనందపడుతున్నాడు. ఆమె గెలవగానే తాను మొదట రాఖీ శుభాకాంక్షలనే పంపానని చెప్పాడు. ఇంతకన్నా తనకు మంచి గిఫ్ట్ ఏముంటుందని అన్నారు. చెల్లెలు సాక్షిపై ఉన్న ప్రేమను మెసేజ్ గుమ్మరించానని అన్నారు. ఆమె విజయాన్ని కుటుంబమంతా కలిసి టీవీలో చూశారు. సాక్షి తల్లి ఆనందం పట్టలేక గెంతులేశారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. కూతురి రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆ తల్లిదండ్రులు.
Mobile AppDownload and get updated news