కృష్ణా పుష్కరాలకు భక్తుల తాకిడి రోజురోజుకి పెరిగిపోతోంది. భారీగా భక్తులు పుష్కర ఘాట్‌కు తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు చెందిన భక్తులు ప్రత్యేక వాహానాల్లో ఘాట్లకు చేరుకుంటున్నారు. పుష్కరాలకు ఇది ఏడో రోజు వచ్చేసింది. ఇంకా అయిదు రోజులే సమయం ఉండడంతో దూర తీరాల నుంచి ప్రజలు వస్తున్నారు. మొదటి మూడు రోజులు ఘాట్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి, మధ్య రోజుల్లో బయల్దేరే వారూ ఉన్నారు. ముఖ్యంగా శ్రావణపౌర్ణమి కావడంతో విజయవాడలోని దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, పవిత్ర సంగమం ఘాట్, గుంటూరు జిల్లాలోని అమరావతి, కర్నూలు లోని శ్రీశైలం, సంగమేశ్వర ఘాట్ లకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణాలోని బీచుపల్లి, గొందిమళ్ల, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
Mobile AppDownload and get updated news