రియో ఒలింపిక్స్ ఫైనల్లో పోరాడి ఓడింది పీవీ సింధు. రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిశాక ఆమె కాసేపు మీడియాతో మాట్లాడింది. తాను ఫైనల్ మ్యాచ్ లో ఓడినా కూడా ఆనందంగానే ఉన్నట్టు చెప్పింది. ఫైనల్లో కరోలినా చాలా బాగా ఆడిందని... నువ్వా నేనా అన్నట్టు తలపడ్డామని చెప్పింది. ఆ రోజు కరోలినాదే పై చేయి అయ్యిందని అంది. రజతం దక్కినందుకు కూడా తాను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పింది. తనకు మద్దతు తెలిపి, విజయం కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తాను ఒలింపిక్స్ లో నిలిచానంటే... అందుకు తన కోచ్ పుల్లెల గోపీచంద్ కారణమని చెప్పింది. తనతో పాటూ కోచ్ కూడా చాలా కష్టపడ్డారని తెలిపింది. పతకాన్ని కోచ్ కు, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్టు తెలిపింది.
Mobile AppDownload and get updated news