అహ్మదాబాద్ : ప్రధాని మోడీ మంగళవారం తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌరాష్ట్ర అవతరణ్ ఇరిగేషన్ (సౌని) పథకం కింద సనోసరా గ్రామాంలోని ఆజి-3 డ్యాంను ప్రారంభించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో కరవును రూపుమాపే ఉద్దేశంతో ఈ డ్యాంను ప్రభుత్వం నిర్మించింది. భవిష్యత్తులో ఈ పథకం కింద సౌరాష్ట్ర ప్రాంతంలో మరిన్ని డ్యాంలు నిర్మించాలని గుజరాత్ సర్కార్ యోచిస్తోంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ తొలి సారి సొంత రాష్ట్రం గుజరాత్ బహిరంగ సభలో పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news