Mobile AppDownload and get updated news
భారీ వర్షాలకు హైదరాబాద్ అస్తవ్యస్తమవుతోంది. బుధవారం ఉదయం నుంచి పడుతున్న వర్షాలకు భాగ్యనగరం నీటమునిగింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్థంభించి పోయింది. నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోల్స్ వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్లపై చాలా చోట్ల మోకాళ్లలోతు నుంచి నడుంలోతు వరకు నీళ్లు నిలిచి ఉండడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరో 24 గంటలు ఇలాగే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని డిప్యూటీ కమిషనర్లకు, ఇతర అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు కూలిపోవడం, ఇంట్లోకి భారీగా నీరు చేరడం, నీటిలో ఎవరైనా చిక్కుకోవడం వంటి పరిస్థితుల్లో హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా కోరుతూ నెంబర్లు ఇచ్చారు. 040-21111 111 లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.