Mobile AppDownload and get updated news
అమ్మాయిలపై అకృత్యాలు భారీగా పెరుగుతున్నాయి. అత్యాచారం చేసి, చంపేయడం చాలా పరిపాటిగా మారింది. అలాగే పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాల బాగోతాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ క్షమించరాని నేరాలుగా పరిగణించింది మహారాష్ట్ర ప్రభుత్వం. అలాంటి నేరాల్లో అరెస్టయి శిక్ష అనుభవిస్తున్న దోషులకు ఇక పెరోల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. జైల్లో ఉన్న దోషులు ప్రత్యేక పర్మిషన్ మీద సెలవు తీసుకుని బయటికి వస్తారు. దానినే పెరోల్ అంటారు. దీనికి ముందుగా ప్రభుత్వ హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలా హోం శాఖకు వచ్చిన పెరోల్ దరఖాస్తును పెండింగ్ లో ఉంచింది ప్రభుత్వం. తమ దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు పెరోల్ మంజూరును నిలిపేయాలని తెలిపింది. ఈ మేరకు జైళ్లలో ఉన్న నిబంధనల పుస్తకంలో సవరణలు చేయాలని సూచించింది. ముంబైలో ఓ హత్య కేసులోని దోషి పెరోల్ పై వెళ్లి పారిపోయాడు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.