అక్టోబర్ 15 నుంచి భారతీయ సంఘటనలకు సంబంధించిన విశేషాలను మోతాదుకు మించి తమ దేశ టెలివిజన్లలో ప్రసారం చేయకూడదని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా అథారిటీ (పీఈఎంఆర్ఏ) నిర్ణయించింది. పాకిస్థాన్ లో ప్రసారమవుతున్న టీవీ ఛానళ్లలో విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వార్తా విశేషాలపై తమ నిబంధనలను విధిగా పాటించాలని పీఈఎంఆర్ఏ చైర్మన్ అబ్సర్ అలామ్ ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ లో ఇండియన్ ఛానళ్లపై కూడా నియంత్రణ కొసాగుతుందని ఆయన తెలిపారు. పాకిస్థాన్ లో ఉన్న దాదాపు 30 లక్షల డీటీహెచ్ కనెక్షన్లను తొలగించాలని ఆయన సంబంధిత శాఖలను ఆదేశించారు. కాగా 24గంటల సమయంలో పది శాతం (2గంటల 40నిమిషాలు) మాత్రమే విదేశీ కంటెంట్ ప్రసారం చేయాలని పాకిస్థాన్ మీడియాపై నియంత్రణ ఉంది.
Mobile AppDownload and get updated news