వ్యభిచార కూపంలో మగ్గుతున్న తనను కాపడటానికి ఒకడొచ్చాడనుకుంది. వాడు కూడా మోసగాడని తెలిశాక, తన దారెటొ తెలియక నడిరోడ్డులో మార్గాలు వెతుకుతోంది ఓ అమ్మాయి. విషయంలోకి వెళ్తే.. గుజరాత్‌లోని వాడియా గ్రామం. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమ్మాయిలకు పెళ్లిల్లు కావు. ఎందుకంటే వారు జీవితాంతం వ్యభిచారం చేస్తూ బతకాల్సిందే. అలాంటి గ్రామం నుంచి వచ్చిన రూపాల్ (గోప్యత కోసం పేరు మార్చాం) అనే అమ్మాయి కేషాజీ చౌదరి (25) అనే యువకున్ని ప్రేమించింది. దీన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరిద్దరూ అహ్మదాబాద్ పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వందల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని రూపాల్ వదిలిపెట్టి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.
ఇదిలా ఉండగా ఈ కథలో మరో కోణం బయటపడింది. కేషాజీ చౌదరికి ఇది వరకే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. చౌదరి చేతులో మోసపోయిన రూపాల్‌కు ఓ స్వచ్ఛంద సంస్థ కల్పించింది. తనను మోసగించిన చౌదరితో రూపాల్ జీవించాలనుకోవట్లేదు. 'చౌదరి నాకు అబద్దాలు చెప్పి మోసగించాడు. నేను నా గ్రామానికి కూడా వెళ్లను, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను' అని రూపాల్ అంటోంది.
Mobile AppDownload and get updated news