ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్ అనే యువకుడు ఓ పానీపురీ షాపులో పనిచేసేవాడు. కొంత కాలం క్రితం అతడు పని మానేయగా, అతడికి యజమాని ఇంకా కొంత జీతం ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బుల కోసం తన స్నేహితుడితో కలిసి అతడు పానీపురీ షాప్ ఓనర్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఓనర్ భార్య మినహా ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయం గమనించిన ఆ మహిళ వారిని నిలదీయగా, ఆమెను కిరాతకంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా విగతజీవిగా పడి ఉన్న ఆమెపై అత్యాచారం చేసి తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. తర్వాత ఆ మృగాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. కాసేపయ్యాక ఇంటికి తిరిగి వచ్చిన భర్త.. ఆమె మరణించి ఉండటాన్ని గమనించాడు. అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. షాపులో పని ఇచ్చి ఉపాధి కల్పించిన పాపానికి ఈ దుర్మార్గుడు తన భార్యనే పొట్టబెట్టుకున్నాడని ఆమె భర్త వాపోయాడు.
Mobile AppDownload and get updated news