జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. షింజో అబే శుక్రవారం నాడు భారత్ విచ్చేశారు. షింజో అబే పర్యటనను పురస్కరించుకుని మోడీ ఆయనను అసాధారణ నేతగా ప్రశంసల్లో ముంచెత్తారు. మూడు రోజుల పాటు జరిగే జపాన్ పీఎం పర్యటనలో పలు కీలకమైన ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగనున్నాయి. మోడీ కూడా షింజో అబే పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని వ్యాఖ్యానించారు. రూ. 98వేల కోట్ల బుల్లెట్ ట్రైన్ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల ప్రధానుల తొమ్మిదో వార్షిక శిఖరాగ్ర సమావేశం శనివారం నాడు జరుగనుంది. గతంలో ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, ఇతరత్రా అంశాలపై కూడా ప్రధానులు సమీక్షలు నిర్వహిస్తారు.
Mobile AppDownload and get updated news