కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్రణాళికలు రచించుకుంటున్న కన్నడ హీరోయిన్ రమ్య అందుకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తోంది. మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, ఆరు నెలలపాటు ఆ పదవిలో కొనసాగిన రమ్య మళ్లీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైంది. అది మొదలు సినిమాలని పక్కనబెట్టి రాజకీయాల్లోనే ఫుల్‌టైమ్ కొనసాగాలని భావిస్తున్న రమ్య.. కర్ణాటక రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీ సమావేశాలకి తరచుగా హాజరవుతూ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన రమ్యకి ప్రస్తుతం అక్కడ అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ.. డీఈఎల్పీ ( డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైట్‌నింగ్ ప్రోగ్రాం) పథకానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్‌ని చేసింది. రమ్యతోపాటే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కూడా డీఈఎల్పీ పథకంకి మరో బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. ఈనేపథ్యంలోనే శుక్రవారం మైసూరులో జరిగిన హోసా బెళకు లెడ్ స్కీమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి చెరోవైపు కూర్చుని వున్న రమ్య, పునీత్ రాజ్‌కుమార్‌లు సరదాగా ఆయనతో ముచ్చటిస్తున్నప్పటి దృశ్యం ఇది.
Mobile AppDownload and get updated news