భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో తొలిసారి జియోసింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)ని గురువారం నింగిలోకి పంపారు. భారత మూడో వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్‌ను జీఎస్ఎల్‌వీ-ఎఫ్05 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 4.30 నిమిషాలకు జీఎస్ఎల్‌వీని ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ 17 నిమిషాల్లో ఉపగ్రహాన్ని నిర్థిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Mobile AppDownload and get updated news