భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎం.ఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ'. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని సన్నివేశాలే కాదు, పాటలు కూడా ధోని నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండేలా దర్శకుడు నీరజ్ పాండే జాగ్రత్తలు తీసుకున్నారు. సంగీత దర్శకుడు అమాల్ మాలిక్ ఈ సినిమాకి అందించిన స్వరాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధోని నిజ జీవితంలోని లవ్ స్టోరీని తెలుపుతూ ఇటీవలే విడుదల చేసిన 'కౌన్ తుఝే ఓ ప్యార్ కరేగా..' అనే రొమాంటిక్ వీడియో సాంగ్ సూపర్బ్ గా ఉంది. సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో కైరా అద్వాణీ నటిస్తోంది. ఇప్పుడు ధోనీ- సాక్షి మధ్య జరిగిన ప్రణయాన్ని 'జబ్ తక్ తుఝె ప్యార్ సే' అనే పాటలో చూపిస్తున్నారు. ఈ వీడియో సాంగ్ విడుదల చేశారు.
సుశాంత్‌తో పాటు కైరా అద్వాణీ, అనుపమ్ ఖేర్, దిశా పతానీ, హెరీ టాంగ్రీ తదితరులు నటించిన 'ఎం.ఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ' సెప్టెంబర్ 30న రివీల్ కాబోతుంది.
Mobile AppDownload and get updated news