ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోదాకు 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారాయని..ఆర్ధిక సంఘం సూచనల ప్రకారం ప్రతి రాష్ట్రానికి 42 శాతం నిధులు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉందన్నారు. ఈ నిబంధనల వల్లే హోదా ఇవ్వలేకపోతున్నామన్నారు. అందుకే హోదాతో సమానమైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని వెంకయ్యనాయుుడు అన్నారు. ఇంతటి భారీ ప్యాకేజీ దేశంలో ఏ రాష్ట్రానికి లభించలేదన్నారు. దేశ చరిత్రలో ఏపీకి ఇస్తున్న ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని వెల్లడించారు. అలాగే పోలవరానికి 100 శాతం నిధులు ఇచ్చేందుకు అంగీకరించామని.. వెనకబడిన జిల్లాలకు రూ.700 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. అలాగే పోర్టుల అభివద్ది విషయంపై కేంద్రం చిత్తశుద్దితో ఉందని తెలిపారు. అలాగే పరిశ్రమల రాయితీ విషయంలో కేబినెట్ లో చర్చించి దీనిపై నిర్ణయం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
రైల్వే జోన్ పై ఆందోళన వద్దు..
ఏపీలో రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకముందే దీనిపై ఆందోళనలు చేయడం సరికాదని హితవుపలికారు. ప్రస్తుతం దీనిపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుత్వ కసరత్తు చేస్తున్నారు. జోన్ ఏర్పాటుకు సాధ్య సాధ్యాలపై లోతైన విశ్లేషణ జరగుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు.
Mobile AppDownload and get updated news