ఉజ్జయినీలోని దోపిడీదొంగల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. పదుల సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉండగా, అక్కడున్న ఒక టోల్ గేటుపైకి మారణాయుధాలున్న కొందరు ఆగంతకులు ఒక్కసారిగా దాడిచేశారు. టోల్ వసూల్లో బిజీగా ఉన్న సిబ్బంది వారిని చూడగానే ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. టోల్ చెల్లించేందుకు వాహనాల్లో వేచిఉన్నవారు కూడా భయంతో బిక్కచచ్చిపోయారు. ఈలోగా వారు టోల్ సిబ్బందిని తమ వద్ద గల ఆయుధాలతో బెదిరించి వారి వద్ద గల నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటుచేసిన నిఘా కెమేరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mobile AppDownload and get updated news