అంతుచిక్కని మరణాలతో గుజరాత్ లోని సూరత్ నగరం భీతిల్లిపోతోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ నగరంలో పదిహేను మంది అసువులు బాశారు. వారి మరణాలకు కారణాలను వైద్యులు సైతం కనిపెట్టలేకపోతున్నారు. రోజుకు ఇద్దరేసి, ముగ్గురేసి వంతున చనిపోగా ఏడురోజుల్లో వారి సంఖ్య పదిహేనుకు చేరింది. అప్పటి వరకు తమతో కలిసి తిరిగిన వారు ఒక్కసారిగా చనిపోతుండటం చూసిన స్థానికులు ఏం చేయాలో తెలియక భయకంపితులైపోతున్నారు. రేపు ఎవరు చనిపోతారో తెలియని రీతిలో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Mobile AppDownload and get updated news