సన్నిలియోన్ ఏ క్షణమైతే బాలీవుడ్ స్టార్ అయిపోయిందో అప్పటినుంచే బాలీవుడ్ హీరోయిన్ హోదాలో అనేక అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తన జీవితంలో ఎప్పటికీ తీరవేమో అనుకునే కోరికలు సైతం తీర్చుకునే అవకాశాలు ఇప్పుడామెకొస్తున్నాయి. చిన్నప్పుడు మోడల్ కావాలని కలలు కన్న సన్నిలియోన్‌కి ఆ కల ఓ కలగానే మిగిలిపోయింది. "18 ఏళ్లప్పుడే మోడలింగ్ వైపు ప్రయత్నాలు చేసినప్పటికీ... 'నువ్ బాగా పొట్టిగా వున్నావ్, లావుగా వున్నావు' అనే సమాధానాలతో నన్ను తిరస్కరించారు. దీంతో జీవితంలో ఎప్పటికీ ఇక నాకు ర్యాంప్ వాక్ చేసే అవకాశమే రాకపోవచ్చేమోనని టెన్షన్ పడ్డాను. కానీ తాజాగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ నాకు ఆ అవకాశాన్ని కల్పించింది" అని ఆనందం వ్యక్తంచేస్తోంది సన్నిలియోన్. సెప్టెంబర్ 8న జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ఇండియన్ డిజైనర్ అర్చనా కొచ్చర్ రూపొందించిన గౌన్‌ని ధరించి ర్యాంప్‌పై హొయలొలికించడమేకాకుండా షో స్టాపర్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన సన్నిలియోన్... న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న మొట్టమొదటి బాలీవుడ్ హీరోయిన్‌గానూ రికార్డు సొంతం చేసుకుంది.
![]()
'ర్యాంప్ వాక్ చేసెటప్పుడు ఎక్కడ పట్టుతప్పి పడిపోతానో అని చాలా భయమేసింది. అలాగే తనతోపాటే ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న యాసిడ్ ఎటాక్ బాధితురాలు రేష్మ ఖురేషితోనూ చాలాసేపే ముచ్చటించాను. ఆమెలోని ఆత్మస్థైర్యం చూస్తే ముచ్చటేసింది' అంటూ సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు జరగనున్న ఈ షో గురించి ఈమెయిల్ ఇంటర్వ్యూలో చాలా విశేషాలే చెప్పుకొచ్చింది సన్నిలియోన్.
Mobile AppDownload and get updated news