Mobile AppDownload and get updated news
సూపర్ స్టార్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని, చెన్నై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో నయనతారను తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే.. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉందట. కథకు ఈ పాత్ర ఎంతో కీలకమని చెబుతున్నారు. ఆ పాత్రకు ఎవరైతే బావుంటారని ఆలోచిస్తున్న సమయంలో నయనతార అయితే పెర్ఫెక్ట్ అని మురుగదాస్ భావించారు. నయనతారను దృష్టిలో పెట్టుకొని పాత్రను మరింత వైవిధ్యంగా రూపొందించి ఆమెకు వినిపించరాట. తన పాత్ర నయన్ ను బాగా ఎగ్జైట్ చేయడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్ బాబు, నయనతారతో కలిసి నటించనేలేదు. ఇప్పుడు వీరిద్దరు ఒకేతెరపై కనిపిస్తే చూసే వారికి కూడా క్రేజీ కాంబినేషన్ లా అనిపిస్తుంది. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'గజిని' సినిమాలో నయనతార నటించింది. ఆ అనుబంధంతోనే మళ్లీ ఈ సినిమాలో నయన్ సెట్ అయింది.