క్రికెట్ ఆడే గణపతిని చూశాం.. బాహుబలి గణేశుడిని చూశాం.. వంద అడుగుల గణపతిని చూశాం.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొలువైన విభిన్న గణేశుల గురించి విన్నాం, కానీ ముంబైలోని ఈ వినాయకుడిని చూడాలంటే మాత్రం మనం స్వెట్టర్లు వేసుకోవాల్సిందే. గజగజలాడే ఐసు గడ్డల మధ్య ఈ వినాయకుడు కొలువై ఉంటాడు. హిమాలయాల్లో హిమలింగం రూపంలో వెలసిన శివుడిని స్ఫూర్తిగా తీసుకున్న భక్తులు ముంబైలో హిమ గణేశుడిని ఏర్పాటుచేశారు. ఐదున్నర అడుగుల ఎత్తున 300 కిలోల మంచుతో ఈ గణనాధుడి విగ్రహాన్ని స్థానిక భక్తమండలి నెలకొల్పింది. ఈ విగ్రహం కరిగిపోకుండా ఉండేందుకు కృత్రిమంగా 10 డిగ్రీల సెల్సియస్ వాతావరణం కల్పించారు. లోపలున్న గణనాధుడిని దర్శించుకోవాలంటే భక్తులు చలికోటులు ధరించి వెళ్లాల్సిందే. లేకుంటే గజగజమని వణికిపోవడం ఖాయం. హారతులిచ్చే వారు కూడా స్వెట్టర్లు వేసుకునే హారతులిస్తున్నారు. ముంబైలో ఈ హిమగణనాధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.
![]()
![]()
Mobile AppDownload and get updated news