Mobile AppDownload and get updated news
తల్లితండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని జాగ్రత్తగా పొదుపుచేసిన బాలిక ఆ మొత్తాన్ని ఒక ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్డిని బహుమతిగా అందచేశింది. భోపాల్ కు చెందిన మెమూనా ఖాన్ (14) అనే బాలిక తన తమ్ముడితో కలిసి ఈ బృహత్కార్యంలో పాలుపంచుకుంది. ఇద్దరూ కలిసి కొద్ది నెలల పాటు తమ తండ్రి ఇచ్చిన చిన్న ఖర్చుల చిల్లర సొమ్మును పొదుపుచేశారు. ఆ మొత్తం రూ. 10వేలు అవ్వగానే తమ నిర్ణయాన్ని తండ్రికి తెలియచేసారు. తన కుమార్తె, కుమారుడు ఇంత చిన్నవయసులోనే సమాజానికి ఉపయోగపడే గొప్ప కార్యాన్ని తలపెట్టారని తెలిసిన తండ్రి వారి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, మరుగు దొడ్డి నిర్మాణానికి అవసరమైన మిగిలిన మొత్తాన్ని అందచేసి భుజం తట్టారు. ఆ మొత్తాన్ని వారు స్థానికంగా ఉన్న బాలికల పాఠశాలకు అందచేయగా ఆ స్కూల్ అధికారులు మరుగుదొడ్డి కట్టించారు.