తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు లేనిపోని భ్రమల్లో విహరిస్తున్నారని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. తెలంగాణకు తాను శాశ్వత ముఖ్యమంత్రిని అనే కలల్లో కేసీఆర్ ఉన్నారన్నారు. హైదరాబాదులో తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కేసీఆర్ తనను తాను తెలంగాణకు శాశ్వత సీఎం అనుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ఇష్టారాజ్యం ఎంతోకాలం సాగదని, ప్రజలు ఆయనకు బుద్ధిచెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేసీఆర్ ను మించిన మహామహా నేతలే ఎన్నికల్లో సోదిలో లేకుండా పోయారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విముక్తి దినాన్ని ఘనంగా అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
Mobile AppDownload and get updated news