Mobile AppDownload and get updated news
ప్రపంచంలో తొలిసారిగా ఒక మైనరుకు కారుణ్య మరణం (యుథనేషియా) పొందే అవకాశం లభించింది. ఇప్పటివరకు నయంకాని రోగాల బారిన పడిన పెద్దలకు మాత్రమే ఈ అవకాశం ఉండగా, తాజాగా బెల్జియం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో కొందరు ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలకు దిగగా మరికొందరు సమర్థిస్తున్నారు. చాలా కాలంగా బెల్జియంలో కారుణ్యమరణం అవకాశం ఉంది. కానీ అది పెద్దలకు మాత్రమే పరిమితం. కానీ రెండేళ్ల క్రితం చేసిన సవరణ మేరకు ఎవరైనా కారుణ్య మరణం పొందవచ్చు. ఆ ప్రకారమే ఆ చిన్నారికి కారుణ్యమరణానికి అనుమతించినట్లు బెల్జియం అధికారులు తెలిపారు. కానీ, ఆ మైనరుకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ కారుణ్యమరణం పొందే అవకాశం ఇచ్చామని అధికారులు చెప్పుతుండటాన్ని కొందరు తప్పుపట్టారు. ప్రత్యేకమైన కేసు అంటే ఏమిటీ, దానికి ప్రభుత్వం ఇచ్చే భాష్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.