ఐప్యాడ్ శ్రేణిలో అతిపెద్దదైన ఐప్యాడ్ ప్రో అమ్మకాలను భారతదేశంలో యాపిల్ కంపెనీ ప్రారంభించింది. దేశంలోని అన్ని రిటైల్ స్టోర్లలో ఇది లభ్యమవుతోంది. ఐప్యాడ్ ప్రో వై-ఫై ఓన్లీ మోడల్ (32జీబి) ధర రూ. 67,900 కాగా 128 జీబి మోడల్ ధర 79900, రూ. 4జి ఎల్టీఈ కనెక్టివిటీతో లభించే 128 జిబి మోడల్ ధర రూ.91900. ఈ ట్యాబ్లెట్ 5.6 మిలియన్ పిక్సెళ్ల సామర్థ్యం గల 12.9 అంగుళాల తెరతో వస్తుంది. యాపిల్ తయారుచేసిన సరికొత్త 64బిట్ ఎ9ఎక్స్ చిప్ ద్వారా పనిచేస్తుంది. దీనికి నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టం ఉంది. 10గంటలపాటు బ్యాటరీ పనిచేస్తుంది.
Mobile AppDownload and get updated news