బస్సు అదుపుతప్పి, నదిలోకి పడిపోవడంతో 41 మంది పోలీసులు మరణించారు. ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగింది. అర్జెంటీనా మిలటరీ పోలీస్ ఫోర్స్ కు చెందిన అధికారులు బస్సులో శాంటియాగో డెల్ ఎస్టిరో నుంచి శాన్ సాల్వడర్ డి జుజుయ్ వెళ్తున్నారు. దారి మధ్యలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. దాదాపు 65 అడుగు ఎత్తు నుంచి బస్సు కిందపడడంతో 41 మంది పోలీసులు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారంతా గాయపడ్డారు.
Mobile AppDownload and get updated news