ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నుండి అక్షింతలు పడ్డాయి. ఆ రాష్ట్రానికి లోకాయుక్తను నియమించడంలో నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్న యూపీ ప్రభుత్వ తీరును సుప్రీం తప్పుపట్టింది. గతంలో పలుమార్లు తాను లోకాయుక్త నియామకంపై ఆదేశాలు జారీచేసినా యూపీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 16వ తేదీలోగా (బుధవారం) లోకాయుక్తను నియమించితీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై తాను యూపీ సీఎం, గవర్నర్లకు నోటీసులు జారీచేయనున్నానని ధర్మాసనం చెప్పింది.
Mobile AppDownload and get updated news