బాలీవుడ్ క్యూట్ లవ్ జంట రణ్‌బీర్ కపూర్ - కత్రినా కైఫ్. ఎక్కడిపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచేవారు. అయితే వారి ప్రేమకు చివరి రోజులు వచ్చాయని సమాచారం. కత్రినా రణ్‌బీర్ తో విడిపోవడానికే నిశ్చయించుకుందని బాలీవుడ్ టాక్. కొన్ని నెలలుగా వీరిద్దరూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న స్వాంకీ అపార్ట్‌మెంట్లో సహజీవనం చేస్తున్నారు. త్వరలో ఇద్దరూ వేరు వేరు అపార్ట్ మెంట్లకి మారిపోతున్నారని తెలుస్తోంది. వారిద్దరి మధ్య పొరపొచ్ఛాలు వచ్చింది దీపికా పదుకుణే వల్లేనట. రణ్ బీర్ మాజీ ప్రేమికురాలు దీపిక. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. రణ్ బీర్ కపూర్-దీపికా పదుకునే కలిసి చేసిన సినిమా తమాషా ప్రస్తుతం ధియేటర్లలో ఉంది. ఈ చిత్ర ప్రమోషన్ కోసం దీపికతో కలిసి టూర్లకు వెళ్లాడు రణ్ బీర్ కపూర్. అది కత్రినాకు అస్సలు నచ్చలేదట.
Mobile AppDownload and get updated news