Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85967

ఆ బాలీవుడ్ టాప్ హీరో... రోబో-2 విలన్

$
0
0

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న శంకర్ చిత్రం రోబో 2. రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ముందు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెంగర్ ను విలన్ గా అనుకున్నారు అయితే... ఆ కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ను ఇండియా తెచ్చి నటింపజేయడానికి చాలా అనుమతులు అవసరం ఉండడంతో విరమించుకున్నారు. తరువాత బాలీవుడ్లో వెతుకులాట ప్రారంభించారు. హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ పేర్లను కూడా పరిశీలించారు. అప్పటికే ధూమ్ 2 లో విలన్ గా చేసిన అనుభవం హృతిక్ కి ఉంది. మరెందుకో కాని వారిద్దరినీ కూడా తప్పించారు. ఆ ఛాన్స్ ను బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ దక్కించుకున్నట్టు సమాచారం. బుధవారం సాయంత్రం అక్షయ్ ముంబయి నుంచి చెన్నై వెళ్లి దర్శకుడు శంకర్, హీరో రజనీకాంత్ లను కలిసి వచ్చారు. సినిమా షూటింగ్ ప్రారంభ పూజలో కూడా పాల్గొన్నారు. ఆ సినిమాకు పనిచేసేవారందరిని పరిచయం చేసుకున్నారు. ఇంకా చిత్రయూనిట్ మాత్రం అక్షయ్ కుమారే విలన్ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అక్షయ్ కూడా ఈ విషయంపై నోరు విప్పడం లేదు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85967

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>