గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాంకేతికంగా ముందడుగు వేస్తోంది. నగరవాసులకు సేవలు సులభతరం చేసేందుకు యాప్ లు రూపొందించబోతోంది. రహదారులు బాగోపోయిన, మ్యాన్ హోల్స్ కు మూతలు లేకపోయినా... ఇలా సమస్య ఏదైనా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వబోతోంది జీహెచ్ఎంసీ. 'హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్‌బీ పేరుతో త్వరలో యాప్ ను అందుబాటులోకి తేనున్నారు. అంతేకాదు ఈ యాప్ ను మీ మొబైల్ డౌన్ లోడ్ చేసుకుంటే... ఏదైనా సమస్యను ఫోటో తీసి దానిని సంబంధింత విభాగాలకు పంపించొచ్చు కూడా. త్వరలో గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. డౌన్ లోడ్ చేసుకున్నాక అందులో వినియోగదారుల సర్వీసెస్ యాప్ ఎంపిక చేసుకోవాలి. అందులో మీ ఫోన్ నెంబర్, పేరు, చిరునామా నమోదు చేసుకోవాలి.
Mobile AppDownload and get updated news